గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ సైడ్ ఆదివారం రాత్రి 2 టౌన్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా టాటా ఏసీ ఆటోలో గంజాయి అమ్ముతుండగా పట్టుబడినట్లు ఎస్ఐ విష్ణు ప్రకాష్ తెలిపారు. నిందితుడు షేక్ అలీమ్ క్రాంతినగర్ కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. గంజాయి, క్యాష్, సెల్ ఫోన్ లు ఆటో స్వాధీనం చేసుకొని నేడు రిమాండ్ కు తరలించారు.
KOTA SAIKRISHNA