ఖాళీ ఉన్నానని కూరగాయలు విక్రయిస్తున్న సర్పంచ్.
ప్రజాసమస్యల పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేద్దామనే సంకల్పంతో సర్పంచులుగా పోటీ చేసి గెలిచిన నిధులు రాక సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
అసిఫాబాద్: ప్రజాసమస్యల పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేద్దామనే సంకల్పంతో సర్పంచులుగా పోటీ చేసి గెలిచిన నిధులు రాక సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సర్పంచులు వ్యవసాయ పనులు చేస్తుండగా మరికొంతమంది తమ వృత్తి పనులను చేసుకుంటున్నారు. వాంకిడి మండలంలోని సామల పంచాయతీ సర్పంచ్ మారుతి ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తన పెరట్లో సాగు చేస్తున్న కూరగాయలను వారసంతలో అమ్ముతుండగా పలువురు చూసి పలకరించారు.
Banka Srinivas