కోడి పందాలు ఆడిన పది మందిపై కేసు నమోదు

కోడి పందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని సిర్పూర్ (టి) ఎస్ఐ ధీకొండ రమేష్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం పారిగాం గ్రామ శివారులో కోడి పందాల స్థావరం పై సిర్పూర్ (టి) పోలీసులు దాడి చేసి పది మందిని పట్టుకున్నారు

కోడి పందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని సిర్పూర్ (టి) ఎస్ఐ ధీకొండ రమేష్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం పారిగాం గ్రామ శివారులో కోడి పందాల స్థావరం పై సిర్పూర్ (టి) పోలీసులు దాడి చేసి పది మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 13, 030 రూపాయల నగదు, నాలుగు పందెం కోళ్ళు, మూడు కత్తులు స్వాధీనం చేసుకోని, 10 మంది పై కేసు నమోదు చేసినట్టు సిర్పూర్ ఎస్ఐ తెలిపారు. కోడి పందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని, గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాని- సిర్పూర్ (టి) ఎస్ఐ ధీకొండ రమేష్ తెలిపారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)