కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సైనిక్ బోర్డ్ కార్యాలయం ఏర్పాటు చేయాలి
ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ త్రైమాసిక సమావేశం కాగజ్ నగర్ పట్టణంలోని బాల భారతి హై స్కూల్ లో ఆదివారం రోజున నిర్వహించడం జరిగిందని ఆర్గనైజర్ సెక్రెటరీ శివ అన్నారు
ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ త్రైమాసిక సమావేశం కాగజ్ నగర్ పట్టణంలోని బాల భారతి హై స్కూల్ లో ఆదివారం రోజున నిర్వహించడం జరిగిందని ఆర్గనైజర్ సెక్రెటరీ శివ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ప్రభుత్వం నుండి అందాల్సిన సదుపాయాలు పథకాలు అందడం లేదని అన్నారు. ముఖ్యంగా ఈసీహెచ్ ఎస్ మెడికల్ సౌకర్యాలు లేక హైదరాబాదు వరకు వెళ్ళ వలసిన పరిస్థితి నెలకొందని, దీంతో ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఎక్స్ సర్వీస్మెన్ల పిల్లలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దేశ రక్షణలో అంకితమైన తమకు ప్రభుత్వం నుండి లభించిన భూములు ఆక్రమణలకు గురి అవుతున్నాయని, తమకు రక్ణణ లేకుండా పోతుందని వాపోయారు. పది వేల మంది వరకు సర్వీస్, ఎక్స్ సర్విస్ మెన్లు ఉన్న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఒక సైనిక్ బోర్డ్ కార్యాలయం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం తరపున ఎక్స్ సర్వీస్ మెన్ అసోషియేషన్ కు స్థలంతో పాటు, భవనం కావాలని అన్నారు. ప్రతీ సంవత్సరం జులై 26న కార్గిల్ షహీద్ దివస్ ను నిర్వహించుటకు కాగజ్‌నగర్ పట్టణంలో అమరవీరుల స్థూపానికి స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ నయీమ్, ఉపాధ్యక్షులు పీ. మండల్, ప్రధాన కార్యదర్శి ఎస్కే మండల్, ఆడీటర్లు నరేందర్ యాదవ్, పీ. శివ, బిదుత్ బిస్వాస్, ఆనంద్ మండల్, సంజయ్ భరద్వాజ్, అడ్వైజర్లు తపన్ మండల్, ముఖేష్ సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Banka Srinivas