కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా స్థానిక బస్ స్టాండ్ వద్ద మహిళల మహా ధర్నా
కేంద్రంలోని బిజెపి సర్కారు పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం పై ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బస్ స్టాండ్ వరకు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారి అద్వర్యంలో మహిళలు పెద
- By khaja --
- Thursday, 24 Mar, 2022
కేంద్రంలోని బిజెపి సర్కారు పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం పై ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బస్ స్టాండ్ వరకు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారి అద్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రధాన మంత్రి దిష్టి బొమ్మని దగ్దం చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇప్పటికే కరోనా వైరస్ తో పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులు అతలాకుతలం అవుతోందన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడం దారుణo అని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెరాస పట్టణ మహిళా అద్యక్షురాలు పెండ్యాల పద్మ, షహనాజ్ బేగం, కౌన్సిలర్ కుర్ర చైతన్య, పత్తిపాటి సంజాత, కోదాటి రమ, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మాజీ MLA, ZPTC తిప్పన విజయసింహ రెడ్డి, సేవ్యా నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, DCCB డైరెక్టర్ బంటు శ్రీనివాస్, MPPలు నూకల సరళ-హనుమంత్ రెడ్డి, లలిత-హతిరం, నందిని-రవితేజ, పోకల శ్రీవిద్య-రాజు, PACS చైర్మన్లు, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మిర్యాల మధుసూదన్, సీనియర్ నాయకులూ యూసుఫ్, అన్నభిమోజు నాగార్జున చారి, జొన్నలగడ్డ రంగారెడ్డి, మదార్ బాబ్, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, సర్పంచ్లు, MPTC లు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
khaja