కామారెడ్డిలో విషాదం: విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి!

కామారెడ్డి జిల్లాకేంద్రంలో విషాదం నెల‌కొంది. బీడీ వ‌ర్క‌ర్స్ కాల‌నీలో విద్యుత్ షాక్‌తో న‌లుగురు మృతిచెందారు. వీరంద‌రూ ఒకే కుటుంబానికి చెందిన‌వారు. మృతుల్లో భార్యభ‌ర్త‌ల‌తోపాటు వారి ఇద్ద‌రి పిల్ల‌లున్నారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..జిల్లా కేంద్ర

కామారెడ్డి జిల్లాకేంద్రంలో విషాదం నెల‌కొంది. బీడీ వ‌ర్క‌ర్స్ కాల‌నీలో విద్యుత్ షాక్‌తో న‌లుగురు మృతిచెందారు. వీరంద‌రూ ఒకే కుటుంబానికి చెందిన‌వారు. మృతుల్లో భార్యభ‌ర్త‌ల‌తోపాటు వారి ఇద్ద‌రి పిల్ల‌లున్నారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన‌ హైమద్ (35), పర్వీన్ (30), అద్నాన్ (4), మాహిమ్ (6) విద్యుత్‌షాక్‌తో మృతిచెందారు. ఇంట్లో మొద‌ట పిల్ల‌ల‌కు విద్యుత్ వైర్ త‌గిలింది. వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నంలో త‌ల్లిదండ్రులిద్ద‌రూ క‌రెంట్ షాక్‌కు గుర‌య్యారు. మృత‌దేహాల‌ను కామారెడ్డి ప్ర‌భుత్వ ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి వ‌చ్చింది.

khaja

Comment As:

Comment (0)