కాన్సర్ తో మరణించిన ASI కుటుంబానికి చెక్కు అందజేత
జిల్లా పోలీస్ కార్యాలయంలో గత సంవత్సరం కేతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిన ASI C.H వెంకన్న కుటుంబ సభ్యులకు మూడు లక్షల ఇరవై వేల రూపాయల భద్రత చెక్కు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- By khaja --
- Friday, 11 Mar, 2022
జిల్లా పోలీస్ కార్యాలయంలో గత సంవత్సరం కేతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిన ASI C.H వెంకన్న కుటుంబ సభ్యులకు మూడు లక్షల ఇరవై వేల రూపాయల భద్రత చెక్కు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AO మంజు భార్గవి , పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, కుటుంబ సభ్యులున్నారు.
khaja