ఓల్డ్ సిటీకి.. యోగి ఆదిత్యనాథ్..!: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో యోగికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికేందుకు
- By khaja --
- Saturday, 02 Jul, 2022
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో యోగికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి 1 గంట 30 నిమిషాలకు భాగ్యలక్ష్మీ ఆలయాన్ని యోగి ఆదిత్యనాథ్ సందర్శించనున్నారు. అనంతరం 2 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్ కు చేరుకోనున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి ఆలయంలో జరిగే మహా హారతి కార్యక్రమంలో హిందువులంతా భారీగా పాల్గొనాలని పార్టీ నేతల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆలయం ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి పోలీసులు భారీ భద్రతను కల్పించనున్నారు. అయితే.. ఇప్పటికే బీజేపీ డెలిగేట్స్ పలువురు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. యూపీ సీఎం యోగితో పాటు మరికొందరు ముఖ్య నేతలు పాతబస్తీలో ఉన్న అమ్మవారి ఆశీస్సులు తీసుకోనున్నారు.
khaja