ఈవీఎం గోదాముల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

ఈవీఎం గోదాముల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

ఈవీఎం గోదాముల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాజేశం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఈవీఎం గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్లు సరిగ్గా పనిచేసేలా చూడాలన్నారు. వాటి నిర్వహణ పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఇంజనీర్లతో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రాజేశ్వర్, ఎమ్మార్వో రామ్మోహన్ రావు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)