ఆర్పీలను మూడు సంవత్సరాలకే తొలగించాలని విడుదల చేసిన సర్కులర్ ను రద్దు చేయాలి.మెప్మా ఆర్పీల నగరకమిటి

ఆర్పీలను మూడు సంవత్సరాలకే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ ను రద్దు చేయాలని కోరుతూ గురువారం మెప్మా ఆర్పీల నగర కమిటి అద్యక్ష కార్యదర్శిలు రుద్రమ్మ, షబానా

ఆర్పీలను మూడు సంవత్సరాలకే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ ను రద్దు చేయాలని కోరుతూ గురువారం మెప్మా ఆర్పీల నగర కమిటి అద్యక్ష కార్యదర్శిలు రుద్రమ్మ, షబానా ఆధ్వర్యంలో కమిటి సభ్యులతో కలిసి పుణ్యవతి పట్టణ లెవెల్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్సులు జి.ధనలక్ష్మీ, జె.కిరన్మయిలకు వినతి పత్రం అందచేశారు. అనంతరం జరిగిన నగరకమిటి సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పీ.నిర్మల, సిఐటియు నగరకార్యదర్శి ఎం.డి.అంజిబాబు,నగర ఉపాధ్యక్షులు టీ.రాముడు మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో గత 15 సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న ఆర్పీ లను అర్ధాంతరంగా తొలగిస్తూ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ప్రభుత్వం సర్కులర్ విడుదల చేయడం దారుణమని అన్నారు.పాదయాత్ర సందర్భంగా ఆర్ పిలు వెట్టిచాకిరి చేస్తున్నారని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.10వేలు వేతనం ఇస్తామని,అన్నలా తోడు ఉంటామని మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని విమర్శించారు పర్ ఫార్మెన్స్ పేరుతో పనికి,జీవితానికి లింక్ చేసి జీతంలో కోతలు విధిస్తున్నారని అన్నారు.ప్రస్తుతం కాలపరిమితి జిఓ పేరుతో ఆర్పీల కుటుంబాలను వీధినపడే విధంగా చేస్తున్నారని,ఆర్.పి ల కుటుంబాలను వీధుల పాలు చేస్తే సిఐటియుగా చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.తక్షణమే కాలపరిమితి సర్కులర్ ను ఉపసంహరించుకోవాలని, పనితో నిమిత్తం లేకుండా ఆర్పిలందరికీ నెలకు రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆర్ పి లందరూ పని భద్రత కోసం దశలవారీగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. జూలై 14వ తేదీ నగరంలో ఉన్న టీఎల్ఎఫ్ వరకు, జూలై 18వ తేది జిల్లా కలెక్టర్,పిడిలకు జూలై 25వ తేదీ లోపు ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని,అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో కలెక్టర్ కార్యాలయం కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలమ్మ, ట్రెజరర్ ఉమాదేవి,నగర ఉపాధ్యక్షులు లక్ష్మీ బాయి, శివలీల,నగర సహాయ కార్యదర్శిలు శ్యామల, పర్వీన్,షేకున్ బీ,నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)