ఆదిలాబాద్లో విషాదం.. 3 నెలల్లో తల్లికూతురు మృతి

ఆదిలాబాద్లో విషాదం.. 3 నెలల్లో తల్లికూతురు మృతి

తన 18 ఏళ్ల కూతురు అనారోగ్యంతో చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అదిలాబాద్లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి వాడలో నివాసం ఉంటున్న ఉగ్గె కవితకు ఒక్కగానొక్క కూతురు. ఆమె 3నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీన్ని జీర్ణించుకోలేని తల్లి.. సంక్రాంతి రోజు ఆత్మహత్య యత్నం చేయగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. 3నెలల వ్యవధిలోనే తల్లి, కూతురు మృతి అందర్నీ కలిచివేసింది.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)