ఆడ ఎస్బీఐ బ్యాంక్ తరలించవద్దని వినతిపత్రం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసిఫాబాద్ మండలంలోని ఆడ గ్రామపంచాయతీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసిఫాబాద్ మండలంలోని ఆడ గ్రామపంచాయతీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఆడ ఎస్బీఐ బ్యాంక్ ను ఆసిఫాబాద్ జాన్కాపూర్ కు తరలిస్తున్నారని, ఆడ పరిసరాల్లో దాదాపు 54 గ్రామాలు ఉన్నాయని ఇక్కడ అన్ని విధాలా సౌకర్యలు ఉండటం వలన తమ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆడ గ్రామంలోనే బ్యాంక్ సేవలు కొనసాగేలా చూడాలని గ్రామస్తులు కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ జిల్లా కలెక్టర్ తో, ఎస్బీఐ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)