ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అక్రమ అరెస్ట్ ను ఖండించిన యూనిట్ ఆఫ్ మాల.
ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ యూనిట్ ఆఫ్ మాల ఆధ్వర్యంలో గట్టయ్య సెంటర్ సరిత క్లినిక్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ సందర్భంగా యూనిట్ ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు కందుల ఉపేందర్ మాట్లాడుతూ
- By khaja --
- Sunday, 17 Jul, 2022
ఖమ్మం : ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ యూనిట్ ఆఫ్ మాల ఆధ్వర్యంలో గట్టయ్య సెంటర్ సరిత క్లినిక్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ సందర్భంగా యూనిట్ ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు కందుల ఉపేందర్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీ పంపుహౌస్ సందర్శనకు వస్తుండగా గ్రావిటీ కెనాల్ వద్ద పోలీసులు అడ్డుకొని , ఆ తర్వాత అక్రమ అరెస్టు చేయడం సమజసం కాదని , తెలంగాణ ఏర్పడిన తర్వాతకి అధికార ప్రజాప్రతినిధులు , అధికారులు మరికొందరు ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ , ప్రాజెక్టుల పేరుతో , అభివృద్ధి పేరుతో అవసరానికి మించిన ఖర్చులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నందున వాస్తవ స్థితిని పరిశీలించడానికి వెళుతున్న మురళిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఖండించారు . ఈ కార్యక్రమంలో యూనిట్ ఆఫ్ మాల జిల్లా కార్యదర్శి గుమ్మడి కనకరాజు , మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి , కమటo వెంకన్న , కె. భవానీ , కె.లక్ష్మి , కె.ఉప్పలమ్మ , సీహెచ్ వెంకటేశ్వర్లు , జి.బాబు , జే. లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు .
khaja