అప్రమత్తమైన రైల్వేశాఖ.. 71 రైళ్లు రద్దు

అగ్నిపథ్‌ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్‌ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో రైళ్లను ఎక్కడికక్కడ ని

హైదరాబాద్‌: అగ్నిపథ్‌ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్‌ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వరంగల్‌ రైల్వే స్టేషన్‌లోనూ రైళ్లను ఆపివేశారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రైల్వే అధికారులు అల్లర్లు సద్దుమణిగిన తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామని చెబుతున్నారు. 

khaja

Comment As:

Comment (0)