అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 36 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. మహానంది మండలం పరిధిలోని గాజులపల్లి చెక్ పోస్ట్ వద్ద రుద్రవరం మండలం నుంచి గిద్దలూరు మండలానికి రేషన్ బియ్యం తరలిస్తున్నారనే
- By khaja --
- Wednesday, 22 Jun, 2022
అక్రమంగా తరలిస్తున్న 36 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. మహానంది మండలం పరిధిలోని గాజులపల్లి చెక్ పోస్ట్ వద్ద రుద్రవరం మండలం నుంచి గిద్దలూరు మండలానికి రేషన్ బియ్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా టాక్టర్ వాహనంలో బియ్యం తరలిస్తూ మహానంది పోలీసులకు పట్టుబడ్డారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు *ఎస్ఐ నాగార్జున రెడ్డి* తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
khaja