అంతర్జాతీయ లయన్స్ ఇంటర్ నేషనల్ సేవా సంస్థ సేవలు ప్రశంసనీయం.*మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి*
ప్రపంచవ్యాప్తంగా లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్,లయన్స్ క్లబ్ కర్నూల్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ,నైస్ కంప్యూ
- By V.VKR --
- Sunday, 17 Jul, 2022
ప్రపంచవ్యాప్తంగా లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్,లయన్స్ క్లబ్ కర్నూల్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ,నైస్ కంప్యూటర్ కార్యాలయం ఆవరణలో 2022-23 సంవత్సరపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హాజరై ప్రసంగించారు.ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలతో ఆత్మసంతృప్తి ఉంటుందన్నారు.ఇన్స్ టలేషన్ ఆఫీసర్ లయన్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాల మద్దయ్య మాట్లాడుతూ ప్రతి సభ్యుడు లయన్స్ ఇంటర్నేషనల్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఐ.విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు.గవర్నర్స్ ప్రతినిధి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని కలిగి ఉండాలన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షురాలిగా నాగలక్ష్మి,కార్యదర్శిగా లయన్ సి.డి.జి.గిరి,క్లబ్ సర్వీస్ చైర్మన్ గా వాసుదేవరావు,అడిషనల్ జాయింట్ సెక్రటరీగా సర్ఫరాజు,శ్రీధర్ లయన్స్ క్లబ్ కర్నూలు సిటీ అధ్యక్షులుగా అయితా వెంకట్రామయ్య,కోశాధికారిగా నాగరాజు,తదితరులచే ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో విభిన్న జాతుల రాష్ట్ర డైరెక్టర్ షరీఫ్, సర్వేశ్వర్ రెడ్డి,విద్యుల్లత,లక్ష్మీ, రమేష్ ,మాజీ కార్పొరేటర్ రమణ తదితరులు పాల్గొన్నారు.
V.VKR