TTD: వృద్ధులు, దివ్యాంగుల కోటా దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ..
TTD: వృద్ధులు, దివ్యాంగుల కోటా దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ..
- By Admin --
- Tuesday, 14 Feb, 2023
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లు ఇవాళ ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో పెట్టింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.