తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక
TSCAB Recruitment: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ షెడ్యూల్డ్ బ్యాంక్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- By Admin --
- Wednesday, 16 Feb, 2022
TSCAB Recruitment: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ షెడ్యూల్డ్ బ్యాంక్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలివే..
ముఖ్య సమాచారం:
- ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏఐఐబీ/ డిప్లొమా (కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్‌మెంట్)/సీఏ/పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు సంబంధిత పనిలో అనుభవంతోపాటు తెలుగు భాషలో మంచి నాలెడ్జ్ ఉండాలి.
- అభ్యర్థుల వయసు 35-62 ఏళ్ల మధ్య ఉండాలి.
- అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను జనరల్ మేనేజర్ (హెచ్ఆర్‌డీ), తెలంగాణ స్టేట్ కొపరేటివ్ అపెక్స్ బ్యాంక్, ట్రూప్ బజార్, హైదరాబాద్, 500001 అడ్రస్‌కు పంపించాలి.
- అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000లతో పాటు అలవెన్సులు కూడా అందిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 25 చివరితేది.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tscab.org/