TRS Plenary: ఇప్పుడు దేశ ప్రజలకు కావాల్సింది.. ఫ్రంట్ లు..టెంట్ లు కాదు: సీఎం కేసీఆర్

రాష్ట్రం మరింత ఉజ్వలంగా ముందుకు వెళ్లాలంటే దేశ రాజకీయాలు కూడా గొప్పగా ఉండాలి'' అని ఇవాళ్టి ప్లీనరీలో ఎంతో మంది అభిప్రాయపడ్డారని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు.అందుకు అనుగుణంగా తప్పకుండా రాబోయే

హైదరాబాద్‌: ''మనం బాగుపడితే సరిపోదు.. రాష్ట్రం మరింత ఉజ్వలంగా ముందుకు వెళ్లాలంటే దేశ రాజకీయాలు కూడా గొప్పగా ఉండాలి'' అని ఇవాళ్టి ప్లీనరీలో ఎంతో మంది అభిప్రాయపడ్డారని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు.అందుకు అనుగుణంగా తప్పకుండా రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో తెరాస పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలు, వ్యవస్థలు, దేశ సమగ్ర స్వరూపం, వనరులు, మౌలిక సదుపాయాలు.. ఇలా అనేక అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు దేశవిదేశాల నుంచి ఎంతో మంది ఆర్థికవేత్తలు, నిపుణులు, మేధావులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్‌ అయిన అఖిల భారత సర్వీసుల అధికారులు దేశవ్యాప్తంగా 2వేలకుపైగా ఉన్నారని.. త్వరలోనే వారందరితో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏ కార్యం చేపట్టినా ఒక సమగ్రమైన ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవతరించాలని ఆకాంక్షించారు. వ్యక్తులు ప్రధానమంత్రులు కావడం ముఖ్యం కాదని.. ఫలితాలు ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మూసధోరణి రాజకీయ విధానాలు మారాలన్నారు. ఇప్పుడు దేశ ప్రజలకు కావాల్సింది ఫ్రంట్‌లు.. టెంట్‌లు కాదన్నారు. ఒక కొత్త పంథాలో ప్రయాణిచేందుకు ఏ రకమైన పద్ధతులు ఎంచుకోవాలి.. వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై చర్చ జరగాల్సిన అవసరం కేసీఆర్‌ వెల్లడించారు.

khaja

Comment As:

Comment (0)