BRS MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి తప్పిన పెను ప్రమాదం
BRS MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి తప్పిన పెను ప్రమాదం
- By Admin --
- Monday, 12 Jun, 2023
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొట్టింది. హూజూరబాద్ లో 2కే రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ నుండి వెళుతుండగా, మార్గమధ్యలో మానకొండూర్ మండలం తాడికల్ సమీపంలో బైక్ ను తప్పించబోయి రోడ్డు పక్కన చెట్టుకు కౌశిక్ రెడ్డి కారు ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. బైక్ పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా వ్యక్తిని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వేరే వాహనంలో హుజూరాబాద్ కు వెళ్లిపోయారు. కౌశిక్ రెడ్డి కారు యాక్సిడెంట్ కు గురైన విషయం తెలియడంతో తొలుత కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. అయితే ఈ ప్రమాదంలో కౌశిక్ రెడ్డికి ప్రాణాపాయం తప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.