21న స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపిక...భూపతి రావు,క్రీడాశాఖ ప్రధాన శిక్షకులు

కర్నూలు స్టేడియంలో ఈ నెల 21న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపిక నిర్వహిస్తున్నట్లు క్రీడాశాఖ ప్రధాన శిక్షకులు భూపతిరావు మంగళవారం తెలిపారు.జిల్లాస్థాయి ఎంపికలో భాగంగా మండలస్థాయి ఎంపికలో పాల్గొని 8 పాయింట్లు

కర్నూలు స్టేడియంలో ఈ నెల 21న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపిక నిర్వహిస్తున్నట్లు క్రీడాశాఖ ప్రధాన శిక్షకులు భూపతిరావు మంగళవారం తెలిపారు.జిల్లాస్థాయి ఎంపికలో భాగంగా మండలస్థాయి ఎంపికలో పాల్గొని 8 పాయింట్లు, అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించిన బాలబాలికలు నేరుగా హాజరు కావచ్చు అని అన్నారు.అంతేకాకుండా ప్రతిభ గల క్రీడాకారులు కూడా నేరుగా జిల్లాస్థాయి పోటీలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలిజబిలిటీ టెస్ట్ ల ద్వారా 11 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థిని, విద్యార్థులను మాత్రమే ఈ నెల 25న వైఎస్ఆర్ క్రీడా పాఠశాలకు రాష్ట్రస్థాయి ఎంపికకు పంపడం జరుగుతుందన్నారు. ఎంపికకు హాజరయ్యే విద్యార్థులు నాలుగో తరగతి చదువుతూ 8 నుంచి 9 సంవత్సరాల లోపు ఉండాలని ఆయన తెలిపారు.

V.VKR

Comment As:

Comment (0)