2024లో టీడీపీ గెలుపుకు కృషి చేయాలి.సోమిశెట్టి వెంకటేశ్వర్లు,,టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు
2024లో టీడీపీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి టి.జి.భరత్ లు సూచించారు. బుధవారం నగరంలోని శ్రీరామ్ నగర్ లో కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు గ
- By V.VKR --
- Wednesday, 13 Jul, 2022
2024లో టీడీపీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి టి.జి.భరత్ లు సూచించారు. బుధవారం నగరంలోని శ్రీరామ్ నగర్ లో కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు గున్నా మార్క్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి టి.జి.భరత్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడారు.వైసీపీ పాలనలో కనీసం కాలనీల్లో రోడ్లు వేయలేని దుస్థితిలో ఉందన్నారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షభావానికి ఎక్కడ చూడు రోడ్లన్ని బురదమయం అయ్యాయని అన్నారు.ఇప్పటికైనా టీడీపీని గెలిపించుకుని ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పాటుపడాలని ఆయన సూచించారు.అనంతరం వారిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు ఎస్.అబ్బాస్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
V.VKR