తెలంగాణలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ(Telangana)లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్(Job Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
- By Admin --
- Friday, 25 Feb, 2022
కరోనా(Corona) వచ్చిన అనంతరం వైద్య విభాగంలో ఖాళీల భర్తీకి ఆయా ప్రభత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు వైద్యం మరింత చేరువ చేసేందుకు పల్లె, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పల్లె దవాఖానాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను జిల్లాల వారీగా ఆహ్వానిస్తోంది సీఎం కేసీఆర్ సర్కార్. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం (bhadrari kothagudem) జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
మొత్తం 97 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు టీఎస్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 34 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

అధికారిక ప్రకటన
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://kothagudem.telangana.gov.in/ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో కనిపించే APPLICATION FOR PALLE DAWAKHANAS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: మీకు కొత్త విండోలో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
Step 4: అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
Step 5: ఆ అప్లికేషన్ ఫామ్ ను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.