buddodu

అంధుల కోసం బాలుడి అద్భుత ఆవిష్కరణ

ఆ బుడ్డోడి వయసు కేవలం 14 ఏళ్లు. వారిది మారుమూల ప్రాంతంలోని ఓ పల్లెటూరు. అయితేనేం 9వ తరగతిలోనే గొప్ప ఆవిష్కరణకు రూపకల్పన చేశాడు. అతడే అస్సాంకు చెందిన అంకురిత్ కర్మాకర్. అంధుల కోసం ప్రత్యేక షూలను తయారు చేశాడు.

ఆ బుడ్డోడి వయసు కేవలం 14 ఏళ్లు. వారిది మారుమూల ప్రాంతంలోని ఓ పల్లెటూరు. అయితేనేం 9వ తరగతిలోనే గొప్ప ఆవిష్కరణకు రూపకల్పన చేశాడు. అతడే అస్సాంకు చెందిన అంకురిత్ కర్మాకర్. అంధుల కోసం ప్రత్యేక షూలను తయారు చేశాడు. సైన్స్, టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టపడే కర్మాకర్ పలు ప్రయోగాలు చేశాడు. కళ్లు లేని వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. దీంతో షూలకు సెన్సార్లను అమర్చాడు. వాటిని ధరించి అంధులు నడిస్తే ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు సైరన్ మోగి, వారిని అలర్ట్ చేస్తుంది. దీంతో వారు సరైన మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. తనకు శాస్త్రవేత్త అవ్వాలని ఉందని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే తన లక్ష్యం సాకారమవుతుందని ఆ బాలుడు చెబుతున్నాడు.


Comment As:

Comment (0)