vadlapaiporu

నేడు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

వడ్ల కొనుగోలు అంశంపై కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించిన తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం కేబినెట్‌తో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది

వడ్ల కొనుగోలు అంశంపై కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించిన తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం కేబినెట్‌తో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ డెడ్‌లైన్ విధించినా, తాము బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై స్పష్టత రానుంది. మరోవైపు కేంద్రంపై ఈ అంశంలో ఒత్తిడి పెంచేందుకు న్యాయస్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించనుంది. ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన కేసీఆర్ తనను అరెస్టు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కారు ధాన్యం ఇవ్వబోమని గతేడాది సంతకం చేసిన విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వమే ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ రెండూ దొందూదొందేనని విమర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశం ఈ రోజు ఏ మలుపు తిరుగుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Comment As:

Comment (0)