child rape

రాత్రిపూట పాల ప్యాకెట్ కోసం వెళ్లిన బాలిక తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి..

రాత్రి పూట పాలకోసం బయటి వచ్చిన ఓ బాలికపై ( minor girl ) రోడ్డుపై ఉన్న ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం ( Rape ) చేశారు. బలవంతంగా తీసుకువెళ్లి తెల్లవారుజామున వదిలిపెట్టారు.

రోడ్డుపై బాలికలు ఒంటరిగా కనిపించారంటే వాళ్లలో కామం కళ్లుమూసుకుపోతుంది. ముఖ్యంగా రోజు కూలి చేసుకునే బాలికలు, మహిళలంటే కామాంధులు మరింత అవకాశంగా మార్చుకుంటున్నారు. తాము కోరుకుంటున్నట్టుగా ఆ మహిళలు ,లేదా యువతులు దరికి చేరకపోతే వారిపై అమానుషంగా అత్యాచారాలు చేస్తున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ అత్యాచారాలు, హత్యలు రోజు కూలీ చేసుకునే మహిళలతో పాటు మధ్యతరగతి వారిపై ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మగడ్డలో ఉండే కుటుంబానికి చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ బాలికపై మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. పెద్దమ్మనగర్ పీజేఆర్‌ గ్రౌండ్‌ సమీపంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాలబూత్‌కు బాలిక వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో.. బోరబండకు చెందిన శివ, మద్యం దుకాణం పక్కనే ఉంటున్న సాయిలు కంటబడింది. ఈ ఇద్దరూ అప్పుడే చిత్తుగా తాగి మద్యం దుకాణం నుంచి బయటకు వచ్చారు.అనంతరం ఆ బాలికను అడ్డగించారు. తమతో రావాలంటూ బలవంతపెట్టారు. అందుకు బాలిక ఒప్పుకోకపోవడంతో.. ఆ దగ్గర్లోనే ఉన్న సాయిలు గదికి బలవంతంగా తీసుకుని వెళ్లారు...భయంతో బయటకు చెప్పని బాలికపై ఇద్దరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. ఇలా రాత్రి పూట బాలిక తెల్లవారు జామున వారి భారి నుండి తప్పించుకుని బయటకు వచ్చింది. అనంతరం ఇంటికి చేరిన బాలిక.. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వెంటనే వారితో కలిసి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Comment As:

Comment (0)