kanna-3-1566892933-1587984421-1676521198

కన్నా రూట్ క్లియర్ - కీలక భేటీ : ముహూర్తం ఫిక్స్..!?

కన్నా రూట్ క్లియర్ - కీలక భేటీ : ముహూర్తం ఫిక్స్..!?

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక ప్రకటనకు సిద్దమయ్యారు. కొంత కాలంగా ఆయన బీజేపీ వీడటం ఖాయమని ప్రచారం సాగుతోంది. టీడీపీ - జనసేనలో ఏ పార్టీలో చేరుతారనే దాని పైన ప్రచారం సాగింది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగారు. కన్నాతో చర్చలు చేసారు. తాను పార్టీ మారుతున్నాననేది కొందరు చేస్తున్న ప్రచారంగా చెప్పుకొచ్చారు. కానీ, బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులుగా జనసేనాని పవన్ కు అనుకూలంగా కన్నా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలో కన్నా పార్టీ మార్పు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


Comment As:

Comment (0)