జగన్ సర్కార్ కు ఉద్యోగుల తాజా డిమాండ్లివే- ఫిబ్రవరి 26 డెడ్ లైన్ !
జగన్ సర్కార్ కు ఉద్యోగుల తాజా డిమాండ్లివే- ఫిబ్రవరి 26 డెడ్ లైన్ !
- By Admin --
- Tuesday, 14 Feb, 2023
ఏపీలో ఉద్యోగులు మరో పోరుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడిచిపోయినా తమ సమస్యలు ఎక్కడికక్కడే ఉండటంతో ప్రభుత్వానికి మరోసారి వాటిని గుర్తుచేసారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి నేతలు సీఎస్ కు తాజాగా ఓ మెమోరాండం సమర్పించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా ఇచ్చారు.
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ నేతలు సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డికి 50 పేజీల మెమోరాండం సమర్పించారు. సీఎస్ కు ఇచ్చిన లేఖలో వారు పలు సమస్యల్ని ప్రస్తావించారు.