ఎవరీ బీనా తివారీ.. ఆనంద్ మహీంద్రా ఎందుకు ట్వీట్ చేశారు..!
ఎవరీ బీనా తివారీ.. ఆనంద్ మహీంద్రా ఎందుకు ట్వీట్ చేశారు..!
- By Admin --
- Wednesday, 15 Feb, 2023
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో టర్కీలో భూకంపం తర్వాత భారత బలగాలు చేపట్టిన ప్రయత్నాలను హైలైట్ చేశారు. అక్కడ పిల్లలలో రక్షించిన భారతీయ ఆర్మీ డాక్టర్ ఫోటోను ట్విట్టర్ లోషేరు చేశారు. ఈ చిత్రం "భారతదేశం ప్రపంచ చిత్రం"గా ఉండాలని పారిశ్రామికవేత్త అన్నారు. ఆ ఫొటోలో భారత ఆర్మీ డాక్టర్, భూ కంపం నుంచి బయటడిన బాలిక ఉన్నారు."ఇస్కెందరున్‌లో టర్కీ భూకంప బాధితుల కోసం భారత సైన్యం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో బాధిత బాలికతో మేజర్ బీనా తివారీ ఉన్నారు.