kandipanta

నాంపల్లిలో చేతికొచ్చిన కంది పంట దగ్ధం

నాంపల్లి మండలానికి చెందిన కటికర్ల వెంకటయ్య ఈ సంవత్సరం 5 ఎకరాల భూమిని కౌలుగా తీసుకోని అందులో పత్తి పంట మరియు కంది పంట పండించారు. పత్తి పంట సీజన్ ముగిసింది. ఇక మిగిలిన కంది పంట బాగా పండిందని వెంకటయ్య కుటుంబ సభ్యులు ఆనంద పడ్డారు.

నాంపల్లి మండలానికి చెందిన కటికర్ల వెంకటయ్య ఈ సంవత్సరం 5 ఎకరాల భూమిని కౌలుగా తీసుకోని అందులో పత్తి పంట మరియు కంది పంట పండించారు. పత్తి పంట సీజన్ ముగిసింది. ఇక మిగిలిన కంది పంట బాగా పండిందని వెంకటయ్య కుటుంబ సభ్యులు ఆనంద పడ్డారు. అంతలోనే దురదృష్టం కొద్ది శుక్రవారం రాత్రి కంది పంట తగలపడింది. పంట నష్టం సుమారుగా 50, 000 వేల రూపాయలు నష్టం జరిగిందని వెంకటయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పంట ఎలా దగ్ధం అయిందో అర్ధం కావడంలేదని కుటుంబ సభ్యులు బాధ పడ్డారు. సంబంధిత అధికారులు పంటను పరిశీలించి, అంచనా వేసి ప్రభుత్వం నుంచి పంట నష్టం కింద ఆర్థిక సహాయం ఇప్పించవలసిందిగా కోరుతున్నారు.


Comment As:

Comment (0)