82143273

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ నేత..?

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ నేత..?

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ఆ ప్రభావం తెలంగాణ పైనా పడుతోంది. కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని భావించారు. అయితే ఫలితాల్లో బీజేపీ దెబ్బతిని కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం ఏర్పడింది. కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరదామనుకున్న నేతలు సైతం ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమైంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి ఓ సీనియర్ నాయకులు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమైనట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే దామోదరరెడ్డి శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవితో భేటీ కావడంతో దామోదరరెడ్డి మరల సొంత గూటికి వెళ్లడానికి సిద్దమైయ్యారని అంటున్నారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన దామోదరరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాకుండా కొత్తగా పార్టీలోకి చేరిన నాగం జనార్ధన్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆగ్రహించి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండు సార్లు ఎమ్మెల్సీగా దామోదరరెడ్డి ఎన్నికయ్యారు.


Comment As:

Comment (0)