759b6ca

ఆ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రభుత్వం గుర్తించేనా.?

ఏపీలో జిల్లా విభజనకు రంగం సిద్ధమవుతోంది ఉంది. ఇప్పటివరకు 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో జిల్లాల ఏర్పాటు ఆహ్వానిస్తుంటే మరికొన్ని ప్రాంతాలలో జిల్లాల విభజనకు వ్యతిరేకిస్తున్

ఏపీలో జిల్లా విభజనకు రంగం సిద్ధమవుతోంది ఉంది. ఇప్పటివరకు 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో జిల్లాల ఏర్పాటు ఆహ్వానిస్తుంటే మరికొన్ని ప్రాంతాలలో జిల్లాల విభజనకు వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటికీ పచ్చిమ ప్రకాశం ప్రాంతంలో మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని నిరసనలు హోరెత్తుతున్నాయి. మొన్నటి వరకు ప్రజా సంఘాలు పోరుబాట చేస్తుండగా వాటికి తోడుగా కులసంఘాలు వామపక్ష పార్టీలు ఉద్యమానికి అండగా నిలిచాయి.

మొట్టమొదట నత్తనడకన సాగిన నిరసన కార్యక్రమాలు క్రమేపి తీవ్రస్థాయి దాల్చాయి. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ పార్టీలు కూడా మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఉద్యమంలో పాల్గొంటున్నాయి.

పచ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలకు ఒంగోలు వెళ్లేందుకు దాదాపు ఆరు నుంచి 4 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తుంది. మార్కాపురం జిల్లాగా ఏర్పడితే పచ్చిమ ప్రకాశం ప్రాంతాలైన గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంత ప్రజలు గంట నుంచి గంటన్నర లోపే జిల్లా కేంద్రానికి చేరుకొని తమ కార్యకలాపాలు ముగించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

పచ్చిమ ప్రకాశం ప్రాంతం ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదని మార్కాపురం జిల్లాగా ఏర్పడితేనే అది సాధ్యమవుతుందని బలంగా తమ నినాదాన్ని వినిపిస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా బలంగా ఉద్యమిస్తూ విద్యార్థులతో నిరసనలను హోరెత్తిస్తున్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తమ మద్దతు ప్రకటించి ఉద్యమంలో పాల్గొంటున్నారు.

పచ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల అభిప్రాయాలను, మనోగతాన్ని, వారి ఆవేదనను అర్థం చేసుకుంటుందా లేదా అని ఈ నెల ఏప్రిల్ 3వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజల సెంటిమెంటును ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


Comment As:

Comment (0)