upsc

సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

సివిల్ సర్వీసెస్ ఆశావహులకు యూపీఎస్‌సీ గుడ్ న్యూస్ అందించింది. ఫిబ్రవరి 2, 2022న యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ నోటిఫికేషన్‌లో మొత్తం 861 ఖాళీలున్నట్టు పేర్కొన్నారు.

సివిల్ సర్వీసెస్ ఆశావహులకు యూపీఎస్‌సీ గుడ్ న్యూస్ అందించింది. ఫిబ్రవరి 2, 2022న యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ నోటిఫికేషన్‌లో మొత్తం 861 ఖాళీలున్నట్టు పేర్కొన్నారు. అయితే తాజాగా మరో ప్రకటన జారీ చేశారు. అందులో పోస్టుల సంఖ్య మరింత పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS)కు సంబంధించి గ్రూప్ ‘ఏ’ లోని 150 పోస్టులను యూపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఖాళీల మొత్తం సంఖ్య 1011కు చేరింది. సివిల్ సర్వీస్‌లలో ఐఆర్ఎంఎస్‌ను చేర్చేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. అయితే తాజాగా యూపీఎస్‌సీ ద్వారానే ఐఆర్ఎంఎస్ ఖాళీలను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఐఆర్ఎంఎస్ గ్రూప్ ఏ ఉద్యోగాలకు వర్తించే నిబంధనలే వీటికీ వర్తిస్తాయి. అయితే దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్‌ల మాదిరిగానే వీటినీ కలిపి భర్తీ చేస్తారు.


Comment As:

Comment (0)