కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏందీది.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు..!
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏందీది.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు..!
- By Arkaan --
- Tuesday, 14 Feb, 2023
మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని తప్పుబట్టారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకోవాలని కోరారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని అన్నారు. అటు మాజీ ఎంపీ మల్లు రవి కూడా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు.