Nuh-District-Hotspot-For-Cyber-Crimes-1686551756-1080

సైబర్ నేరగాళ్ల కొత్త అడ్డా.. నుహ్.. ఇదెక్కడ ఉందంటే?

సైబర్ నేరగాళ్ల కొత్త అడ్డా.. నుహ్.. ఇదెక్కడ ఉందంటే?

కంటికి కనిపించకుండా.. జనాల బలహీనతలు.. అమాయకత్వం.. అవగాహన రాహిత్యంతో ఆటలాడుకుంటూ.. వేలాది కోట్లు దోచేస్తున్న సైబర్ దొంగలు కంటికి కనిపించరు. కానీ.. వారి కారణంగా లక్షలాది మంది బాధితులుగా మారుతున్న పరిస్థితి. సరిగా చదువుకోకున్నా.. కంప్యూటర్ ను ఆపరేషన్ చేయటం.. పెద్ద ఎత్తున ట్రాప్ చేయటం.. వారిని ఊరిస్తూ డబ్బులు లాగేసే సైబర్ నేరగాళ్లకు అడ్డాగా ఇప్పటివరకు రాజస్థాన్ లోని భరత్ పూర్.. జార్ఖండ్ లోని జామ్ తారాల పేర్లు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది హర్యానాలోని నుహ్ జిల్లా.

భౌగోళికంగా చూస్తే.. హర్యానా.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీకి కేవలం రెండు గంటల జర్నీ దూరంలో ఉండే ఈ జిల్లాలో సైబర్ నేరగాళ్లు భారీగా ఉంటారు. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉండే నుహ్ జిల్లా సైబర్ నేరస్తులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీనికి కారణం.. కొవిడ్ మహమ్మారిని చెప్పాలి.


Comment As:

Comment (0)