సిపిఎస్ రద్దు చేయాలి**పాఠశాలల విలీనం మానుకోవాలి
సిపిఎస్ రద్దు చేయాలని, పాఠశాలల విలీనం మానుకోవాలని,ఎపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు
- By V.VKR --
- Tuesday, 19 Jul, 2022
సిపిఎస్ రద్దు చేయాలని, పాఠశాలల విలీనం మానుకోవాలని,ఎపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు,జిల్లా ఉపాధ్యక్షులు తిక్కస్వామి, ప్రసాద్ రావు,భీమిరెడ్డి, నర్సింహులు హాజరయ్యారు.ధర్నా ఉద్దిశించి నాగరాజు మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం సాగిస్తామని అన్నారు.పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలుపుకోవాలని సూచించారు.సిపిఎస్ రద్దు,పాఠశాలల విలీనం తక్షణమే రద్దు చేయాలనీ వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
V.VKR