డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ లో ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు న్యాయం చేయాలి
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ లో ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా అధికారులను కోరారు.శుక్రవారం నగరంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద విద్యార్థులు,తల్లితండ్రులతో కలిసి ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన చ
- By V.VKR --
- Friday, 15 Jul, 2022
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ లో ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా అధికారులను కోరారు.శుక్రవారం నగరంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద విద్యార్థులు, తల్లితండ్రులతో కలిసి ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా,విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హైస్కూల్లో అడ్మిషన్లు పొందడం కొరకు జూన్ 29న తల్లిదండ్రులకు స్కూల్ నుండి సమాచారం రావడంతో తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్లి అడ్మిషన్ కొరకు సంప్రదించడం జరిగిందని అన్నారు.ప్రవేశ పరీక్ష పెడతామని ఆ పరీక్షలో ఉత్తీర్ణమైన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని హెచ్ఎం పేర్కొన్నట్లు చెప్పారు.ఇందుకోసం 350 నుండి 400 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.దాంట్లో కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు జూలై 15వ తేదీ వచ్చి అడ్మిషన్లు పొందగలరని, స్కూల్ నోటీస్ బోర్డ్ లో పెట్టడం జరిగిందన్నారు. కానీ నేడు విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లగా మేము పెట్టిన పరీక్ష కమిషనర్ రద్దు చేశారని, తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారని చెప్పడంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నిరాశ చెందరని అన్నారు.ఈ విషయం మేయర్, కమిషనర్ ల దృష్టికి వినతిపత్రం ద్వారా తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు.సానుకూలంగా కమిషనర్,మేయర్ లు స్పందిస్తూ విద్యార్థులకు న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు సాయి సిటీ నాయకులు అమర్ ప్రకాష్ నరసింహ మరియు విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.
V.VKR