కె.జి.బి.వి టీచింగ్ సిబ్బందికి టైం స్కేల్, నాన్ టీచింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

కర్నూలు నగరం, కల్లూరు చెన్నమ్మ సర్కిల్, సూర్యనారాయణ భవన్ కర్నూల్ నందు ఆదివారం కే.జీ.బీ.వీ ఉద్యోగుల సమావేశం జిల్లా కె.జి.భి.వి నాయకులు సుమలత, నాగరత్న అధ్యక్షతన జరిగింది.సమావేశానికి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.బాలకాశి హాజరయ్యారు.

కర్నూలు నగరం, కల్లూరు చెన్నమ్మ సర్కిల్, సూర్యనారాయణ భవన్ కర్నూల్ నందు ఆదివారం కే.జీ.బీ.వీ ఉద్యోగుల సమావేశం జిల్లా కె.జి.భి.వి నాయకులు సుమలత, నాగరత్న అధ్యక్షతన జరిగింది.సమావేశానికి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.బాలకాశి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలయింది. ఇప్పటికి కేజీబీవీ ఉద్యోగులకు జీతాలు పెరగలేదన్నారు.పెరగకపోగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేశారు. ఇది చాలా దుర్మార్గం అని ఆగ్రహం చెందారు. కే.జీ.బీ.వీ టీచింగ్ సిబ్బందికి టైం స్కేల్ అమలు కోసం మూడు జీవోలు ఇచ్చారు.కానీ నేటికీ అది అమలు నోచుకోలేదన్నారు.రకరకాల కారణాలు చెబుతూ ఉద్యోగులను మోసం చేస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు.అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని,అది కూడా అమలు చేయలేదని చెప్పారు.ఇప్పటికే మూడు సంవత్సరాలు ఎదురు చూశాం.ఇంకా ఉద్యోగులందరితో కలిసి జేఏసి అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.జె ఎస్ సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. చైర్మన్ విజయ్ మాట్లాడుతూ కేజీబీవీలను వివిధ కేటగిరీలుగా ప్రిన్సిపాల్,సి ఆర్ టిలు, పి ఈ టిలు,పిజిటిలు, అకౌంటెంట్స్,కంప్యూటర్, ఒకేషనల్ ఇన్స్ స్ట్రక్టర్స్, ఏఎన్ఎంలు,అటెండర్లు స్వీపర్లు,తదితర ఉద్యోగులు దాదాపుగా జిల్లాలో 1100 మండి ఉద్యోగులు 10 సంవత్సరాలు పైగా చాలీచాలని వేతనంతో పని చేస్తున్నారన్నారు.వీరందరికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజీలను అప్ గ్రేడ్ చేశారు.కానీ బోధన మరియు బోధ నేతర సిబ్బందిని నియమించాలి. లేకుంటే ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి ఎక్కువ అవుతుందన్నారు.ఇప్పటికే చాలా కాలేజీల్లో తీవ్రమైనపని ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నారు.11వ పిఆర్సి లో పేర్కొన్న విధంగా మహిళా ఉద్యోగులందరికీ 5 అదనపు క్యాజువల్ లీవులు,7 స్పెషల్ క్యాజువల్ లీవులు ఇవ్వాలన్నారు.కేజీబీవి ఉద్యోగులందరికీ వారి క్యాడర్ ను బట్టి వారికి జీతాలు పెంచాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు.జిల్లా జేఏసి నాయకులు నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమిష్టిగా పోరాడాలని,పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకోగలమని సూచించారు.అనంతరం 15 మందితో కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ కార్య్రక్రమంలో ఉద్యోగులు కవిత,రమాదేవి,నాగరత్న, సుమలత,మంజుల,ఫిరోజ్ బేగం,చిట్టెమ్మ,పలువురు ఎస్ ఓలు,సి ఆర్ టి లు ,పి ఈ టి లు,పిజిటిలు, పాల్గొన్నారు. *డిమాండ్స్* 1.టీచింగ్ సిబ్బందికి మినిమం టైం స్కేలు అమలు చేయాలి. 2 .11వ పిఆర్సిలో పేర్కొన్న విధంగా మహిళా ఉద్యోగులకు ఐదు అదనపు క్యాజువల్ లీవులు,ఏడు స్పెషల్ క్యాజువల్ లీవులు ఇవ్వాలి. 3.వేతనంతో కూడిన 30 రోజుల మెడికల్ లీవ్ లు ఇవ్వాలి. 4.డి ఎ హెచ్ ఆర్ ఏతో కూడిన బదిలీలు ఉండాలి. 5..సీనియర్ సిఆర్టి లను స్పెషల్ ఆఫీసర్లుగా మరియు పిజిటిలుగా అవకాశం ఇవ్వాలి. 6..కేజీబీవీ ఉద్యోగుల క్యాడర్ను బట్టి వారికి వేతనాలు పెంచాలి. 7.ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.

V.VKR

Comment As:

Comment (0)