కాలువలు శుభ్రం చేసి ప్రజలను కాపాడాలి
కర్నూలు నగరంలోని అబ్బాస్ నగర్, హోసింగ్ బోర్డు కాలనీ, రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంతంలో కాలువలు శుభ్రం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆంధ్రపదశ్ ప్రజా సంక్షేమ సేవా సమితి నాయకులు నాగేశ్వరి, చందు, రవికుమార్, కృష్ణారెడ్డి, సూరి, మహేష్, ప్రభాకర్ లు
- By V.VKR --
- Thursday, 21 Jul, 2022
కర్నూలు నగరంలోని అబ్బాస్ నగర్, హోసింగ్ బోర్డు కాలనీ, రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంతంలో కాలువలు శుభ్రం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆంధ్రపదశ్ ప్రజా సంక్షేమ సేవా సమితి నాయకులు నాగేశ్వరి, చందు, రవికుమార్, కృష్ణారెడ్డి, సూరి, మహేష్, ప్రభాకర్ లు గురువారం మీడియాతో వెల్లడించారు. అబ్బాస్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ఈ మధ్య కురిసిన వర్షపు నీరు గత 10 రోజుల నుండి కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల ప్రధాన రోడ్డుపై నిలిచిపోయినట్లు చెప్పారు. కాలువల్లో పూడికలు తీయనందున మురికినీరు ఎక్కడికి వెళ్లలేక రోడ్డు మీదే నిలువవుండడంతో చెరువును తలపిస్తుందని అన్నారు. దీంతో మురికినీరు నుండి దుర్గంధం ఏర్పడి దోమలు, పందులు సైర్యవిహరం చేస్తున్నాయని చెప్పారు. పాదచారులు నానావస్థలు పడుతున్నారు. కాలువలో నడవడం వల్ల గజ్జి, దురదలాంటి వాటితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల రీత్యా డెంగ్యు, మలేరియా మొదలగు జబ్బులకు గురవుతున్నారన్నారు. పలుమార్లు సచివాలయాలు, అధికారులకు పిర్యాదు చేసిన పట్టిపట్టనట్లు వ్యవహారిస్తున్నట్లు ఆవేదన చెందారు. కావున కమీషనర్ ఎ.భార్గవ్ తేజ తక్షణమే చోరువ తీసుకోవాలని ఆంధ్రపదశ్ ప్రజా సంక్షేమ సేవా సమితి నాయకులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు కోరుతున్నారు.
V.VKR