అకాల వర్షానికి నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన టిఆర్ఎస్ పార్టీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన వరి పంట పొలాలను పోటాపోటీగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ , బిజెపి పార్టీ ,అధికార టీఆర్ఎస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన వరి పంట పొలాలను పోటాపోటీగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ , బిజెపి పార్టీ ,అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం పంట పొలాలను పరిశీలించారు.వ్యవసాయ అధికారులు సైతం మండలంలో ఏ ఏ గ్రామాల్లో ఆకాలవర్షానికి ఎంత నష్టం జరిగింది ఏ ఏ రైతు ఎంత నష్టపోయిండు వివరాలను ఎల్లారెడ్డిపేట మండల వ్యవసాయాధికారి భూమిరెడ్డి నేతృత్వంలో వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్ నేతృత్వంలో ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు దోమ్మాటి నర్సయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిజెపి మండల అద్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి నేతృత్వంలో బిజెపి నాయకులు మండలంలోని వివిధ గ్రామంలో పోటాపోటీగా పంటలను పరీశీలించారు.ఆకాల వర్షానికి నష్టపోయిన రైతుకు ఎకరానా 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి ,కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్నీ డిమాండ్ చేస్తుండగా ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి కెసిఆర్ ,రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ దృష్టి కి తీసుకపోయి న్యాయం చేయిస్తామని రైతులకు భరోసా కల్పిస్తున్నారు.ఆయా పార్టీల నాయకులు ఉనికికోసం రాజకీయ పార్టీల లబ్దీకోసం పంటలను పరిశీలించుడు పోవుడు తప్పా తమకు చేసేది ఏమీలేదని రైతులు అంటున్నారు. నష్టపోయిన రైతులను అదికారంలో ఉన్నముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

OGGU

Comment As:

Comment (0)