3,4,5 తరగతుల విలీనం ఉపసంహరించుకోవాలి.టిఎన్ ఎస్ ఎఫ్ డిమాండ్

కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం,వన్ టౌన్ లోని,పెద్ద పడకన,ప్రాథమిక పాఠశాల కార్యాలయం వద్ద టీఎన్ ఎస్ ఎఫ్ కర్నూల్ పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ బొగ్గుల ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్

కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం,వన్ టౌన్ లోని,పెద్ద పడకన,ప్రాథమిక పాఠశాల కార్యాలయం వద్ద టీఎన్ ఎస్ ఎఫ్ కర్నూల్ పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ బొగ్గుల ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి బొగ్గుల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యను దూరం చేసే జీవో 117ను రద్దు చేయాలన్నారు.చట్టం ప్రకారం పిల్లలను, స్వేచ్ఛగా,చదువనివ్వాలని,పాఠశాలలో చదివే పిల్లలను ఇబ్బందులకు గురిచేయడం సబబుకాదన్నారు.ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉంటే,పి.ఈ.టి,హెచ్ ఎం,సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులను , విలీనం వలన నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు.ప్రాథమిక పాఠశాల విలీనం వలన దూరంలో ఉన్న హైస్కూల్ కు తమ పిల్లలను ఎలా పంపించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.రాష్ట్రంలో ఉండే లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాల విలీనం కారణంగా దూరంలో ఉన్న హైస్కూల్కు వెళ్లలేక చదువుకు స్వస్తి చెప్పే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.తక్షణమే ప్రాథమిక పాఠశాల విలీన ప్రక్రియను ప్రభుత్వం మానుకోవాలని అయన తెలిపారు.టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డీపోగు బజారన్న మాట్లాడుతూ ప్రాథమిక విద్యను పేదవాళ్లకు అందించడం,పదివేల స్కూలు రాష్ట్రవ్యాప్తంగా మూసివేయడం అన్యాయమైన చర్య అన్నారు.జీవో నంబర్ 117 ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజశేఖర్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)