9, 10వ తరగతి చదువుతున్న విభిన్న ప్రతిభావంతులకు ఆన్ లైన్ లో (వికలాంగులు) ప్రీమెట్రిక్ స్కాలర్షిప్
2022-23 విద్యా సంవత్సరమునకు నేషవల్ స్కాలర్షిప్ (NSP) పోర్టల్ నందు (ఎ).9, 10వ తరగతి చదువుతున్న విభిన్న ప్రతిభావంతులకు ఆన్ లైన్ లో (వికలాంగులు) ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు విభిన్న ప్రతిభావంతులు, హీజ్రాల మరియు
- By V.VKR --
- Thursday, 21 Jul, 2022
2022-23 విద్యా సంవత్సరమునకు నేషవల్ స్కాలర్షిప్ (NSP) పోర్టల్ నందు (ఎ).9, 10వ తరగతి చదువుతున్న విభిన్న ప్రతిభావంతులకు ఆన్ లైన్ లో (వికలాంగులు) ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు విభిన్న ప్రతిభావంతులు, హీజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు విజయ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆన్ లైన్ పోర్టల్ http://scholarships.gov.in నందు ధరఖాస్తు చేసుకొవాలని సూచించారు. సెప్టెంబర్ 39వ తేదీ ధరఖాస్తు చివరి తేది అని అన్నారు. ఇంటర్, డిప్లమా, గ్రాడ్యూయోట్, పోస్ట్ గ్రాడ్యూయోట్ చదువుచున్న విభిన్న ప్రతిభావంతులు (వికలాంగులు) పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లేక టాప్ క్లాస్ ఎడ్యూకేషన్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ ద్వారా http://scholarships.gov.in నందు ధరఖాస్తు చేసుకొవలన్నారు. ఇందుకు అక్టోబర్ 31వ తేదీ ధరఖాస్తు చివరి తేది అని ఆమె తెలిపారు.
V.VKR