నిబంధనలను పాటించని ఇంటర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వాన్ని నిబంధనలను పాటించకుండా,అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంటర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యా

ప్రభుత్వాన్ని నిబంధనలను పాటించకుండా,అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంటర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధోని రాజు, మహేశ్వరయ్యలు కర్నూలులో ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఆర్ ఐ ఓ గురువయ్య శెట్టికి బుధవారం ఎన్ ఎస్ యు ఐ బృందం వినతిపత్రంఅందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. జెఈఈ, నీట్ పేరుతో విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు గుంజుతున్న నారాయణ, శ్రీ చైతన్య, ఎస్ ఆర్ గాయత్రి, శ్రీ గాయత్రి, భాష్యం వంటి కార్పోరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫీజుల దోపిడీని ప్రభుత్వం నియంత్రించాలని కోరారు.  రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 2వేలకు పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో మౌళిక సదుపాయాల లేమితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలతో పాటు మరో 292 బాలికల జూనియర్ కాలేజీలను ప్రారంభించిందని, అయితే లెక్చరర్లు, సిబ్బంది, ప్రయోగశాలలు లేకుండా చదువు ఎట్లా సాగుతుందని ప్రశ్నించారు. మరోప్రక్క నారాయణ, శ్రీ చైతన్య,ఎస్ ఆర్ గాయత్రి,శ్రీ గాయత్రి భాష్యం వంటి కార్పోరేట్ జూనియర్ కాలేజిలు ఇంటర్ విద్యను శాసిస్తున్నాయని అన్నారు. లక్షలాది రూపాయలు ఫీజుల దోపిడీ చేస్తున్నా, అక్రమంగా అడ్మిషన్స్ నిర్వహించినా, ఒక బ్రాంచి పర్మిషన్ తో రెండు, మూడు బ్రాంచీలు నడుపుతున్న, ప్రభుత్వ అనుమతి లేకుండా, నిబంధనలు, ప్రమాణాలు పాటించకుండా హాస్టల్స్,  కాలేజీలు నిర్వహిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని విమర్శించారు. తక్షణమే కార్పోరేట్ జూనియర్ కాలేజీలపై సమగ్ర దర్యాప్తు జరిపించి, అనుమతిలేని, నిబందనలు పాటించని వాటిని మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు,మద్దిలేటి, మదన్ , రవి, అజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)