*అన్నిదానాల్లో అన్నదానం మిన్న*

*అన్నిదానాల్లో అన్నదానం మిన్న*

అన్నిదానాల్లో కెల్లా అన్నదానం మిన్న అని పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ‌ అన్నారు. మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మి నరసింహ స్వామి కాలనీలో యువ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మంటపం వద్ద ఆదివారం నిర్వహించిన మహ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాతలు జై వాసవి ఆర్ జె గ్రూప్ నిర్వాహకులు సంపంగి రమేష్ కుటుంబ సభ్యులు, కాందికొండ వంశీధర్ కుటుంబ సభ్యులు పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... అన్ని దానాల్లో అన్నదానం మిన్న అంటారు. నలుగురి ఆకలితీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలను శాలువాలతో సత్కరించారు. అందుకు తగ్గట్టుగానే వందల మందికి సరిపడేలా భోజనాలు తయారు చేయించినందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినా యూవ ఫ్రెండ్స్ యూత్ సభ్యులను అభినందించారు. దాతలతో కలిసి భక్తులకు వడ్డిస్తూ మానవసేవే మాధవసేవ అని తరిస్తు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వివరిస్తూ.. వృథా చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, ఐడియా ఎస్టేట్ డెవలపర్స్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, నాయకులు బాలగౌని చిన్న నర్సింహ గౌడ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ నాయక్, కే యం రెడ్డి, సురేష్ నాయక్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Gade

Comment As:

Comment (0)