సెక్రటరీలు సమయపాలన పాఠించాలి: సౌందర్య ఆనంద్
సెక్రటరీలు సమయపాలన పాఠించాలి: సౌందర్య ఆనంద్
రెబ్బెన ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలతో రివ్యూ సమావేశం ఎంపీపీ జమ్మిడి సౌందర్య ఆనంద్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క సెక్రటరీ సమయపాలన పాటించాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలలో ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని, అదే విధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్ళులు కట్టుకునేవారికి ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని ఆదేశించారు. కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ వార్డులలో పరిశుభ్రంగా ఉండే విదంగా చూడాలని సూచించారు. ప్రతిరోజు శానిటేషన్ వర్క్స్ చేస్తూ ఉండాలని, కంటి వెలుగు పథకం ప్రతి గ్రామగ్రామానికి చేరేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి విజయవంతం చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, ఎంపీఓ అంజాద్ పాషా, సెక్రటరీ లు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA