విద్యార్థిని పై అత్యాచారం: కోచింగ్ సెంటర్ నిర్వహకుడి అరెస్ట్.
రాయచోటి : పదవ తరగతి విద్యార్థినిపై ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కడప జిల్లా రాయచోటిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..
- By khaja --
- Saturday, 02 Jul, 2022
రాయచోటి : పదవ తరగతి విద్యార్థినిపై ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కడప జిల్లా రాయచోటిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..రాయచోటిలోని కొత్తపేటకు చెందిన అభిరామ్రెడ్డి జిటెక్ ట్యూటోరియల్ కోచింగ్ సెంటర్ పేరుతో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు కోచింగ్, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాడు. పదో తరగతిలో రెండు సబ్జెక్టులు ఫెయిలైన ఓ విద్యార్థిని ఈ కోచింగ్ సెంటర్కు వెళ్తున్నారు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను బలవంతంగా అత్యాచారం చేశాడు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అభిరామ్రెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ అన్నమయ్య జిల్లా కన్వీనర్ వినరు కుమార్ డిమాండ్ చేశారు.
khaja