వర్కింగ్‌ జర్నలిస్టులు, హోంగార్డులకు సామాజిక భద్రతా స్కీమ్‌ ఏడాది పొడిగింపు..

రాష్ట్రంలో ట్రాన్స్‌పోర్ట్‌, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆటో డ్రైవర్‌లు,హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు సామాజిక భద్రత స్కీమ్‌ను మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ట్రాన్స్‌పోర్ట్‌, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆటో డ్రైవర్‌లు,హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు సామాజిక భద్రత స్కీమ్‌ను మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 31తో స్కీమ్‌ ముగియనుండగా మరో ఏడాది పాటు దీనిని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. స్కీమ్‌లో భాగంగా ప్రమాదవశాత్తు మరణించిన ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌, వర్కింగ్‌ జర్నలిస్టులకు రూ.5 లక్షలను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ స్కీమ్‌కు అర్హులైన వారి పేర్లను అటు ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ నుంచి ఇటు సమాచార శాఖ కమిషనర్‌ నుంచి కార్మిక శాఖ సేకరిస్తుంది. స్కీమ్‌కు బీమా సేవలందించే ఏజెన్సీని కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ పద్ధతిద్వారా నిర్ణయించనున్నట్లు తెలిపారు.

khaja

Comment As:

Comment (0)