రైస్ మిల్లు లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

5 డీసీయం వ్యాన్ లు, 1 టాటా ఏస్ వాహనాలు సీజ్: పోలీసుల అదుపులో రైస్ మిల్లు యజమాని జగిత్యాల ప్రతినిధి, మే20,( చాటింపు) జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాముల కోట గ్రామ శివారులో గల హనుమాన్ సాయి రైస్ మిల్లు

5 డీసీయం వ్యాన్ లు, 1 టాటా ఏస్ వాహనాలు సీజ్: పోలీసుల అదుపులో రైస్ మిల్లు యజమాని జగిత్యాల ప్రతినిధి, మే20,( చాటింపు) జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాముల కోట గ్రామ శివారులో గల హనుమాన్ సాయి రైస్ మిల్లు పై డీఎస్పీ ప్రకాష్ ,సి సి ఎస్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించగా సుమారు 700 క్విటాళ్ల రేషన్ బియ్యం, రేషన్ బియ్యం సరఫరాకు ఉపయోగిస్తున 5 డిసియం వ్యాన్ లు , 1 టాటా ఏస్ వాహనాలు పట్టుకోవడం జరిగింది.అనంతరం తదుపరి విచారణ నిమిత్తం రైస్ మిల్లు ఓనర్ కొండ లక్ష్మణ్ ను , రేషన్ బియ్యంను,వాహనాలు పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరండిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారస్తులు వారి నుండి అక్రమంగా కొనుగోలు చేసి, అట్టి బియ్యాన్ని ఎక్కువ ధరకు మార్కెట్ లో అమ్మి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలు అయిన పిడిఎస్ రైస్ నిల్వ ఉంచడం, రవాణా చేయడం,గుట్కా, మొదలైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ యొక్క తనిఖీలో టౌన్ ఇన్స్పెక్టర్ కిషోర్, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, జగిత్యాల రూరల్ ఎస్.ఐ అనిల్ , సివిల్ సుప్ల్లెయ్ అధికారులు సీసీఎస్,రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahendhar

Comment As:

Comment (0)