undefined

రంగాపురం శివారు వాగులో మృత దేహం లభ్యం

ఖానాపురం మండలం రంగాపురం గ్రామ శివారులోని పాఖాల వాగు ఒడ్డున మృత దేహం లభ్యమైంది. స్థానిక ఎస్ ఐ తిరూపతి కథనం ప్రకారం... నర్సంపేట మండలం ఇటుకాలపల్లి శివారు నర్సింగపురం గ్రామానికి

ఖానాపురం మండలం రంగాపురం గ్రామ శివారులోని పాఖాల వాగు ఒడ్డున మృత దేహం లభ్యమైంది. స్థానిక ఎస్ ఐ తిరూపతి కథనం ప్రకారం... నర్సంపేట మండలం ఇటుకాలపల్లి శివారు నర్సింగపురం గ్రామానికి చెందిన గొర్రె సాంబయ్య (47) మతి స్థిమితం కోల్పోయాడు.కాగా ఈ నెల 18వ తేదీన కుటుంబ సభ్యులు వారి బంధువుల ఇళ్లలో పెళ్లికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి సాంబయ్య కనిపించలేదు. వారికి తెలిసిన బంధు, మిత్రుల ఇండ్లలో ఎంత వెతికినా అచూకి లభించలేదు. కూలీలు రంగాపురం శివారు పాఖాల వాగు ప్రక్కన గల వరి పొలానికి వెళ్ళగా ఏదో దుర్వాసన రాగా వెంటనే సర్పంచ్ , పోలీసులకు సమాచారం అందించారు.పోలీసు వారు అక్కడికి వెళ్లి విచారించగా గొర్రె సాంబయ్య మృతదేహం అని తెలిసింది. ఈమేరకు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వివరించారు.

mallesh Reporter

Comment As:

Comment (0)