యువత సేవా కార్యక్రమంలో రాణించడం అభినందనీయం

యువత సేవా కార్యక్రమంలో రాణించడం అభినందనీయమని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు.జీవీఎంసీ 21వ వార్డు పరిధి చిన్న వాల్తేరు పరిధి మొహమ్మదియా యూత్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మహమ్మదీయ మస్జిద్ ప్రాంగణంలో

విశాఖ: యువత సేవా కార్యక్రమంలో రాణించడం అభినందనీయమని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు.జీవీఎంసీ 21వ వార్డు పరిధి చిన్న వాల్తేరు పరిధి మొహమ్మదియా యూత్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మహమ్మదీయ మస్జిద్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటుగా రాష్ట్ర వక్ప్ బోర్డ్ డైరెక్టర్ స్వప్నం అఫ్రోజ్ ప్రారంభించారు. యువత ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా సభ్యులను అభినందించారు. ఈమేరకు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి పండ్లు, సహజసిద్ధమైన శీతల పానీయాలు అందజేశారు. ఇప్పటికే మొహమ్మదియా యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అనేక సేవకార్యక్రమాలు నిర్వహించమని సభ్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో మొహమ్మదియా యూత్ అసోసియేషన్ సభ్యులు షేక్ ఖాదర్ బాబా , ముస్తఫా , షాజహాన్ , మహబుబ్ , నౌషాద్ , రఫి , షమీ , ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ హరి

Comment As:

Comment (0)